నల్గొండ జిల్లా అనుముల మండలం తిమ్మాపురం గ్రామంలో వైద్య సిబ్బంది ప్రజల నుంచి నమూనాలను సేకరించారు. కరోనా వ్యాప్తి, నిరోధకశక్తి స్థాయిని కనుగొనేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మూడో విడతలో భాగంగా 42 మందికి పరీక్షలు నిర్వహించారు.
ముగ్గురు వైద్యుల బృందం సమక్షంలో సేకరించిన నమూనాలను హైదరాబాద్ నుంచి దిల్లీకి పంపనున్నారు. హాలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది వారికి సహకరించారు. ఇదే బృందం రేపు పెద్దవూర మండల కేంద్రంలో నమూనాలను సేకరించనుంది.