సంచార జీవనం సాగిస్తున్న మూడు కుటుంబాలకు... నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నిత్యావసరాల్ని అందజేశారు. బియ్యం, వంటనూనెలు, ఇతర సరకులతోపాటు... 5 వేల నగదును అందించారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిలోని ఏపీ లింగోటం గ్రామ సమీపంలో... ఆయా కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి.
'బుక్కెడు బువ్వ కరువైపాయె' పేరిట ఈనాడు-ఈటీవీభారత్లో వచ్చిన కథనానికి స్పందించిన రాజ్యసభ సభ్యుడు సంతోశ్ కుమార్... చిరుమర్తితో చరవాణిలో మాట్లాడారు. వారికి వెంటనే సహాయం అందించాలని సూచించగా... నిత్యావసరాలు అందించారు. అటు స్థానిక పోలీసులు సైతం తోచినంత సాయమందించారు.