ETV Bharat / state

దయచేసి వినండి - ట్రైన్​లలో అలా చేయకండి : శబరిమల వెళ్లే భక్తులకు రైల్వే కీలక విజ్ఞప్తి - SOUTH CENTRAL RAILWAY SUGGESTION

పూజా కార్యక్రమాలలో హారతి, కర్పూరం వెలిగించడం నిషేదం - మానవ ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని హెచ్చరిక

RAILWAY REQUEST TO PASSANGERS
SOUTH CENTRAL RAILWAY (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 3, 2024, 7:57 PM IST

Devotees Going to Sabarimala : శబరిమలకు వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. రైళ్లలో పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదని, కర్పూరం వెలిగించవద్దని విజ్ఞప్తి చేసింది. ప్రయాణికుల రైళ్ల కోచ్‌ల లోపల పూజా విధానంలో భాగంగా కర్పూరం వెలిగించడం, అగరబత్తులు, హారతి ఇవ్వడం, సాంబ్రాణి పుల్లలు వెలిగించడం వంటివి చేస్తున్నట్టు రైల్వే అధికారుల దృష్టికి వచ్చినట్లు తెలిపింది. ఇలాంటి కార్యక్రమాలు ట్రైయిన్​లో చేయవద్దని యాత్రికులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసింది.

పూజా కార్యక్రమాలపై నిషేధం : ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే(SCR) శబరిమలకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్లు జోన్‌లోని సికింద్రాబాద్‌, కాచిగూడ, హైదరాబాద్‌, తిరుపతి, కాకినాడ, నాందేడ్‌ తదితర స్టేషన్ల నుంచి బయలుదేరి మార్గమధ్యలో పలు స్టేషన్లలో ఆగుతాయి. ఆయా ప్రాంతాల నుంచి ప్రయాణించే వారు సురక్షితంగా గమ్య స్థానాలకు చేరేందుకు రైల్వే శాఖ ప్రయాణికుల సహకారం కోరుతుంది. రైళ్లలో, రైల్వే స్టేషన్​ ప్రాంగణాలలో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదని విజ్ఞప్తి చేసింది. మండే స్వభావంగల పదార్థాలతో ప్రయాణం చేయడం, వాటిని ఏ రూపంలోనైనా వెలిగించే చర్యల పట్ల నిషేధం విధించినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.

రైల్వే చట్టం ప్రకారం నేరం : మండే స్వభావం గల పదార్థాలు అగ్ని ప్రమాదాలకు దారితీసి, మానవ ప్రాణాలకు ముప్పు కలిగించడమే కాకుండా రైల్వే ఆస్తులకు సైతం నష్టం కలిగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు రైల్వే చట్టం-1989లోని సెక్షన్లు 67, 154, 164, 165 ప్రకారం శిక్షార్హమైన నేరంగా పరిగణించబడతాయని స్పష్టం చేసింది. ఇటువంటి చర్యల వల్ల జరిగిన నష్టానికి బాధ్యత వహించడంతో పాటు, 3 సంవత్సరాల జైలు శిక్ష లేదంటే జరిమానా లేదా రెండూ ఒకేసారి విధించే అవకాశముందని అధికారులు తెలిపారు.

తెలంగాణ నుంచి కాచిగూడ - కొట్టాయం మధ్య డిసెంబర్‌ 5 నుంచి 27 వరకు ప్రతి గురు, శుక్రవారాల్లో ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు కొనసాగించనున్నాయి. కాచిగూడ - కొట్టాయం (07133) రైలు డిసెంబర్‌ 5, 12, 19, 26 తేదీల్లో (ప్రతి గురువారం) మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషాలకు కాచిగూడ రైల్వే స్టేషన్​లో బయల్దేరి శుక్రవారం సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు కేరళలోని కొట్టాయం చేరుకోనుంది.

ఎంతో రుచికరమైన శబరిమల "అరవణ ప్రసాదం" - ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా!

శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్తున్నారా? భక్తులు ఈ హెల్త్ టిప్స్ పాటించాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.