ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. భానుడి ప్రతాపానికి జనం బెంబేలెత్తిపోతున్నారు. పగటిపూట 45-46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య బయటకు రావాలంటే జనం భయపడుతున్నారు. గత ఐదు రోజులుగా జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 15 రోజుల్లో వడదెబ్బకు 7 మంది మృత్యువాత పడ్డారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్లన్నీ మధ్యాహ్నం సమయంలో నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతల పానీయాలు సేవిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప ఎండపూట బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు.
ఇవీ చూడండి: 'స్థానిక' అభ్యర్థుల కోసం గులాబీ కసరత్తు