ETV Bharat / state

మునుగోడు ఉపఎన్నికకు భారీ భద్రత.. ఆ ప్రాంతాల్లో స్పెషల్ ఫోకస్! - మునుగోడు ఉపఎన్నిక భారీ భద్రత

Heavy security for Munugode bypoll 2022 రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠరేపుతున్న మునుగోడు ఉపఎన్నికకు పోలీసులు పటిష్ఠ భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా కేంద్ర, రాష్ట్ర బలగాలు పహారా కాస్తున్నాయి. 35 సున్నిత ప్రాంతాలను గుర్తించామన్న పోలీసు ఉన్నతాధికారులు... ఆయా ప్రాంతాల్లో అదనపు భద్రత కల్పించనున్నట్లు వెల్లడించారు.

Heavy security for Munugode bypoll 2022
Heavy security for Munugode bypoll 2022
author img

By

Published : Nov 2, 2022, 7:39 PM IST

మునుగోడు ఉపఎన్నికకు భారీ భద్రత.. ఆ ప్రాంతాల్లో స్పెషల్ ఫోకస్!

Heavy security for Munugode bypoll 2022 రాష్ట్ర ప్రజల్లో ఆసక్తిని, ప్రధాన పార్టీల్లో ఉత్కంఠను రేపుతున్న మునుగోడు ఉపఎన్నికకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. చెదురుమదురు జరుగుతున్న ఘటనల దృష్ట్యా 2 వేల మంది సిబ్బందితో బందోబస్తు కల్పిస్తున్నారు. మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.

ఉపఎన్నిక భద్రతకు సంబంధించిన ఏర్పాట్లపై ఆయన పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల వేళ భద్రతాచర్యల్లో పాల్గొనే పోలీసులతో చౌటుప్పల్‌లో భగవత్ సమావేశమయ్యారు. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపుర్ మండలాలు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలతో బందోబస్తు ఉంటుందని.... ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

హింసాత్మక ఘటనలకు అవకాశమున్న కేంద్రాలను గుర్తించి... ప్రత్యేకంగా బలగాలను ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు చెక్‌పోస్టుల్లో తనిఖీలు నిరాటంకంగా కొనసాగిస్తామన్నారు. గత ఎన్నికల్లో హింసకు పాల్పడిన వారిని బైండోవర్‌ చేశామన్న పోలీసు ఉన్నతాధికారులు.... ఇప్పటివరకు 4 కోట్ల నగదు సీజ్‌ చేశామని వెల్లడించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.