నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం వ్యాప్తంగా ఈరోజు తెల్లవారు జామున కురిసిన వర్షాలు రైతన్నను తీవ్రంగా ముంచాయి. కొన్ని చోట్ల పంటలు, మార్కెట్ యార్డులో నిల్వ ఉంచిన ధాన్యం నీట మునిగాయి. చింతపల్లి మండలం నసర్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రంలో రైతులు నిల్వ ఉంచిన ధాన్యం ఈరోజు తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి నీట మునిగింది. భారీగా నీరు చేరడంతో ఐకేపీ కేంద్రం కాస్తా చెరువును తలపిస్తున్నట్టు ఉంది.
ఇక చేసేదేమి లేక రైతులు జేసీబీ సహాయంతో నీట మునిగిన ధాన్యాన్ని తీస్తున్నారు. అనుకోకుండా కురిసిన భారీ వర్షానికి ధాన్యం నీట మునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కాస్తా నీట మునగడంతో ఎమీ చేయాలో తోచని స్థితిలో పడ్డారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: Vaccine Drive : మహానగరంలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్