ఎన్నడూ లేనంత స్థాయిలో... నల్గొండ జిల్లా కేంద్రాన్ని వర్షం వణికించింది. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన వానకు... వీధులన్నీ జల సంద్రంగా మారాయి. పలుచోట్ల చెట్లు విరిగి తీగలపై పడినందున... విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వీటీ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, రాఘవేంద్ర కాలనీ, లెప్రసీ కాలనీ... ముంపు బారిన పడ్డాయి.
లెప్రసీ కాలనీలోని ఇళ్లల్లోకి నీరు చేరడంతో... స్థానికులు ఉదయం నుంచి అవస్థలు పడ్డారు. ప్రకాశం బజార్లోని ఇళ్లల్లోకి నీరు చేరింది. కాలనీల్లో పరిస్థితిని ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి పరిశీలించారు. బాధితులకు... సమీపంలోని ప్రార్థన మందిరంలో ఆశ్రయం కల్పించారు.
కేవలం ఆరు గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో... 20.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అవడం కలవరానికి గురి చేసింది. తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు రహదారిపై పారిన వరదలతో... వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అద్దంకి - నార్కట్పల్లి రహదారిపై నీరు నిలిచి... జనం అవస్థలు పడ్డారు.
ఇదీ చదవండిః 'వారి జీవితాల్లో విషాదం నింపిన విహారయాత్ర'