సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో .. ప్రభుత్వం నిషేధించిన గుట్కా, పొగాకును అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన మహమ్మద్ కలీం మజీద్ కాంప్లెక్స్‌లో పాన్ షాప్ నిర్వహిస్తున్నాడు.
సోదాల్లో..
కలీం పాన్ షాప్‌లో .. ప్రభుత్వం నిషేధించిన గుట్కా, పొగాకు ప్యాకెట్లు విక్రయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. సోదాలు నిర్వహించిన పోలీసులకు రూ. 3 లక్షల 50 వేల విలువైన గుట్కా, పొగాకు ప్యాకెట్లు దొరికాయి. కేసు నమోదు చేసుకున్న హుజూర్ నగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి:బాహాబాహీ: ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాల ఘర్షణ