సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యల కేసుల్లో... విచారణ వేగంగా కొనసాగుతోంది. గతేడాది ఏప్రిల్లో వెలుగుచూసిన హత్యోదంతాలపై... నల్గొండ మొదటి అదనపు సెషన్స్ న్యాయస్థాన పోక్సో చట్టం కోర్టులో వాదనలు జరుగుతున్నాయి.
ఇవాళ మరో ఇద్దరి కేసుల్లోనూ... డీఎన్ఏ, ఫోరెన్సిక్ నివేదికల సారాంశాల్ని అందజేయనున్నారు. పోక్సో చట్టంతోపాటు వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుల్ని... ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉదహరించారు. 101 మంది సాక్షుల వాంగ్మూలాలు పరిశీలించిన తర్వాతనైనా శ్రీనివాస్ రెడ్డికి కఠిన శిక్ష విధించాలని... న్యాయవాది కోర్టును కోరారు.
ఇదీ చదవండి:కడు పేదరికంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత!