యూరియ కొరతపై భాజపా నాయకులు చేస్తున్న ఆరోపణలను ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తిప్పికొట్టారు. అసలు యూరియా కొరతకు కమలం పార్టీనే కారణమన్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా రాష్ట్రానికి కావలసినంత సరఫరా చేయలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. యూరియా కొరత లేకుండా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కమిషన్లకు కక్కుర్తి పడి తప్పుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
ఇవీచూడండి: గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్‌కు సన్మానం