నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని విజయ్ విహార్‌కు చేరుకున్న తర్వాత శాసనమండలి ఛైర్మన్ గుత్తాసుఖేందర్‌రెడ్డి కృష్ణా జలాల వివాదంపై మాట్లాడారు. పోతిరెడ్డిపాడు ద్వారా 44 వేల క్యూసెక్కుల నీటిని తీసుకుపోవాలని ఏపీ ప్రభుత్వం దుర్మార్గంగా ఆలోచిస్తున్నదన్నారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకి నీటిని తరలిస్తే సాగర్ ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు. గతంలో ముఖ్యమంత్రి వైఎస్సార్ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేస్తూ నీటిని తీసుకుపోతే ఇప్పుడు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి నీటిని తీసుకుపోవాలని దుర్మార్గంగా ఆలోచిస్తున్నారని ఆయన చెప్పారు.
ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెనక్కి తీసుకొని పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా నీటిని తీసుకుపోవాలనే ఆలోచనను విరమించుకోవాలని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పరితపించే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులకు అన్యాయం జరిగితే సహించరని ఆయన తెలిపారు.
ఇవీ చూడండి: ఎంపీ అర్వింద్‌పై ఈసీకి తెరాస నేత ఫిర్యాదు