ETV Bharat / state

కొవిడ్​ బాధితులకు కొవిడ్​ హెల్త్​ కిట్లు పంపిణీ చేసిన గుత్తా తనయుడు - నల్గొండ తాజా వార్తలు

నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో గుత్తా సుఖేందర్​ రెడ్డి కుమారుడు పీపీఈ కిట్లు పంపిణీ చేశారు. గుత్తా వెంకట్​ రెడ్డి ట్రస్ట్​ ఆధ్వర్యంలో ఆస్పత్రికి మూడు ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్లు, మాస్కులు, పీపీఈ కిట్లు అందించారు.

Telangana news
నల్గొండ వార్తలు
author img

By

Published : May 26, 2021, 7:03 PM IST

గుత్తా వెంకట్​రెడ్డి ట్రస్ట్​ ఆధ్వర్యంలో మండలి ఛైర్మన్​ గుత్తాసుఖేందర్​ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్​రెడ్డి మిర్యాలగూడలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మిర్యాల గూడ ఏరియా ఆస్పత్రికి ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్లు, పీపీఈ కిట్లు, మాస్కులు అందించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 65 మంది కొవిడ్​ బాధితులకు మందులు, శానిటైజర్లు, థర్మామీటర్​, జీడిపప్పు, బాదం పప్పు, ఫేస్​ షీల్డ్​ సహా 13 రకాలతో కలిపిన కిట్లను అందించారు. మహమ్మారి నుంచి అందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామాల్లో చికిత్స పొందుతున్న వారికి గ్రామాల వారీగా ఇంఛార్జులకు కిట్లు అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నలమోతు భాస్కరరావు, మున్సిపల్ వైస్ ఛైర్మన్ కుర్ర విష్ణు, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: eamcet: ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.