ETV Bharat / state

పశువైద్యం దైన్యం.. సిబ్బంది కొరతతో మూతబడుతున్న వైద్యశాలలు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో సిబ్బంది లేక పశు వైద్యశాలలు మూతపడుతున్నాయి. సిబ్బంది కొరత వల్ల పశువుల ప్రాణాల గాలిలో దీపంలా మారాయి. దీనికి తోడు రోగాలతో పశువులు మృత్యువాత పడుతుండడం వల్ల పశుపోషకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

government veternary hospitals closed due to no staff in nalgonda district
సిబ్బంది లేక మూతపడుతున్న పశువైద్యశాలలు... ఇబ్బందుల్లో పశుపోషకులు
author img

By

Published : Jul 23, 2020, 11:35 AM IST

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పశువైద్యం దీనంగా మారింది. ఏళ్ల తరబడి ఖాళీలు భర్తీ చేయడం లేదు. సిబ్బంది కొరతతో ఆశించిన స్థాయిలో పశువైద్యం అందడం లేదు. పశుగణన లెక్కల ప్రకారం అధికారికంగా 5 వేల పశువులకు ఒక ఆస్పత్రి ఉండాల్సినప్పటికీ సబ్‌సెంటర్లు లేకపోవడంతో పశువుల ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి. వీటికి తోడు రోగాలతో మూగజీవాలు మృత్యువాతపడుతుండడంతో పశుపోషకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

మారుమూల గ్రామాల్లో దైన్యం

దేవరకొండ డివిజన్‌ కేంద్రంలో అధికారులు విధులకు అడపాదడపా వస్తుండగా గ్రామాల్లో కిందిస్థాయి సిబ్బందితో వైద్యాన్ని ముందుకు సాగిస్తున్నారు. చాలా వరకు రైతులు చరవాణి ద్వారా తెలిసిన పశువైద్యులను సంప్రదించి మూగజీవాలకు చికిత్స చేయిస్తున్నారు. మారుమూల ప్రాంతాలైన చందంపేట, నేరడుగొమ్ము, డిండి మండలాల్లోని పశువైద్యశాలల్లో సిబ్బంది ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో అర్థంకాని పరిస్థితిలో పశుపోషకులు ఉన్నారు. నియోజకవర్గానికి ఒకటి సంచార పశువైద్యశాల ఉన్నా.. మధ్యాహ్నం మూడు తర్వాత వారు విధుల్లో ఉండరు.

ఇదీ పరిస్థితి..

నల్గొండ జిల్లాలో పశువైద్యశాలలను పర్యవేక్షించాల్సిన ప్రధాన అధికారి జేడీఏ పోస్టు ఖాళీగా ఉండడంతో ఇక్కడ ఇన్‌ఛార్జిగా మరొకరు విధులు నిర్వహిస్తున్నారు. పూర్వ నల్గొండ జిల్లాలో ప్రతి ఐదేళ్లకోసారి పశుగణన చేపడుతున్నారు. నల్గొండ జిల్లాలో 5లక్షల పశువులు ఉండగా 13లక్షల గొర్రెలు ఉన్నాయి. సూర్యాపేటలో 3లక్షల పశువులు, 8.5లక్షల గొర్రెలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 4లక్షలకు పైగా పశువులు, 9లక్షల గొర్రెలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పశువుల్లో ఎక్కువగా గాలికుంటు వ్యాధులు సోకుతుండడంతో పశు పోషకులు ప్రైవేట్‌ వెటర్నరీ మెడికల్‌లో మందులు కొనుగోలు చేసుకొని వారే స్వయానా చికిత్స చేయించుకునే పరిస్థితి నెలకొంది. కోదాడలో 11 వైద్యశాలలుండగా, 22 ఉప కేంద్రాలు కొనసాగుతున్నాయి. వీటిలో మూడు వైద్య పోస్టులు ఖాళీతో పాటు ఎనిమిది మంది కిందిస్థాయి సిబ్బంది కొరత ఉండడంతో పశువైద్యం దయనీయంగా మారింది. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో 15 ఆస్పత్రులకు గాను 18 మంది కిందిస్థాయి సిబ్బంది, ఒక డాక్టర్‌ పోస్టు ఖాళీగా ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 213 పోస్టులకు గాను 84 మంది సిబ్బంది ఉన్నారు.

జిల్లాల వారీగా..

జిల్లాపశు వైద్యశాలలువైద్యుల ఖాళీలుసిబ్బంది ఖాళీలు
నల్గొండ1211106
సూర్యాపేట851075
యాదాద్రి భువనగిరి74441

పశువులకు సరైన వైద్యం

- శ్రీనివాసరావు, జేడీ, పశువైద్యశాఖ

జిల్లాలో పశువులకు ఉన్న సిబ్బందితో సరైన వైద్యం అందిస్తున్నాం. అక్కడక్కడ సిబ్బంది కొరత ఉంది. వాటిని కూడా తొందర్లోనే భర్తీ చేసేందుకు ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఇవీ చూడండి: కృష్ణా జలాలపై లెక్కలు చెప్పండి: బోర్డు ఛైర్మన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.