రబీలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ అన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలో వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. లాక్డౌన్తో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారా యంత్రాగం చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రైతు పండించే చివరి గింజ వరకు మద్దతు ధరకు తగ్గకుండా కొనుగోలు చేస్తామని తెలిపారు. గ్రామాల్లో ఐకేపీ కేంద్రాలు, పట్టణంలో మిల్లర్ల ద్వారా ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. స్థానికంగా మిల్లులు ఎక్కువగా ఉండటం వల్ల రైతులు మిల్లులో అమ్మడానికే మొగ్గుచూపుతున్నారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కరోనా నుంచి కోలుకున్న 11మంది డిశ్చార్జ్