ETV Bharat / state

డిండి ముంపు గ్రామాల రైతుల ఆందోళన - formers

డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా భూనిర్వాసితులకు మల్లన్నసాగర్ బాధితులకు ఇచ్చినటువంటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎకరాకు 11లక్షల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని కోరారు.

రైతును అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
author img

By

Published : Jun 13, 2019, 5:01 AM IST

Updated : Jun 13, 2019, 6:54 AM IST

నల్గొండ జిల్లా డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న చర్లగూడెం, కిష్టారాయిన్ పల్లి ప్రాజెక్టు పరిధిలో ఉన్న ముంపు గ్రామాల రైతులు ఆందోళన బాట పట్టారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాలకు ఇచ్చినటువంటి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు. ఎకరాకు 11లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. ప్రాజెక్టు పనులకు అంతరాయం కలిగిస్తున్న వారిని పోలీసు అధికారులు అడ్డుచెప్పి వారిని వారించారు.

డిండి ముంపు గ్రామాల రైతుల ఆందోళన

ఇవీ చూడండి: శాంతి సూచి జాబితాలో భారత్@141

Intro:Tg_mbnr_14_12_srinivasa_kalyanam_av_C12
భక్తి భావం ఉప్పొంగింది ఓం నమో వెంకటేశాయ అంటూ భక్తులు తరలించారు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం మక్తల్ మండల కేంద్రంలో లో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అంగరంగ వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో లో నిర్వహించారు...

Body:నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కల్యాణోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. భగవంతుని కళ్యాణాన్ని తిలకించిన భక్తులు దివ్యానుభూతి పొందారు. పవిత్రమైన ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి విచ్చేసిన వేద పండితులు సంప్రదాయ పూజలు చేశారు. ప్రధాన అర్చకులు నారాయణాచార్యుల బృందం విశ్వక్సేన, ఆరాధన,పుణ్యావచనం,అంకురార్పణం, రక్షా కంకణ ధారణ, శాంతి హోమం,సుముహూర్తం జిలకర బెల్లం, యజ్ఞోపవీత సాధారణ సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం భక్తులు గోవింద నామస్మరణ చేస్తుండగా అర్చకుల వేద మంత్రోచ్ఛారణలతో మధ్య శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. మంగళసూత్రధారణ తర్వాత తలంబ్రాలు వాహనం పూర్ణాహుతి నిర్వహించారు. ఈ మహోత్సవంలో భాగంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే భక్తి సంకీర్తన కచేరి అలరించింది.

Conclusion:మక్తల్ నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని, వర్షం సమృద్ధిగా కురవాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండేలా శ్రీ వేంకటేశ్వర స్వామి చల్లని చూపులు ఉండాలని పూజించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థాన బృందం, భక్తులు పాల్గొన్నారు.
Last Updated : Jun 13, 2019, 6:54 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.