గిరిజనులకు, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు సీఎం కేసీఆర్ నెరవేర్చడం లేదని మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ ఆరోపించారు. సాగర్ ఉప ఎన్నికల్లో భాజపా జెండా ఎగరాలన్నారు. నల్గొండ జిల్లా పెద్దవూర మండలం గేమ్యానాయక్ తండాలో గిరిజన పోరు పాదయాత్రను ప్రాంభించారు.
భాజపా జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి, ఎన్నికల సమన్వయ కర్తలు సంకినేని వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, డా.రవి నాయక్తో కలిసి మొదలు పెట్టారు. గిరిజన హక్కులు, 12 శాతం రిజర్వేషన్ల అమలు, పొడు భూముల సమస్యల పరిష్కారానికి పాదయాత్ర చేపట్టారని రవీంద్ర నాయక్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: డబ్బు లేకుంటే ఎన్నికల్లో పోటీ చేయకూడదు: చిన్నారెడ్డి