నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో భాజపా అభ్యర్థి రవికుమార్‌ను గెలిపించాలని భాజపా నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి కోరారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఉన్న పుస్తకాన్ని ఆవిష్కరించారు. మోసపూరిత వాగ్ధానాలు చేస్తున్నారని కేసీఆర్‌పై మండిపడుతున్నారు.
యువతరం అంతా భాజపా నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని పెద్దిరెడ్డి తెలిపారు. సాగర్ ఉప ఎన్నికల్లో ప్రజల్లో మార్పు కనిపిస్తోందని వెల్లడించారు. కాంగ్రెస్, తెరాస పాలన చూశారని... మార్పు కోసం భాజపాను గెలిపించాలనుకుంటున్నారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి ఓటు వేసిన దండగేనన్నారు.
ఇదీ చూడండి:ఇవాళ ఒక్కరోజే ఉంది... అప్రమత్తంగా ఉండండి..!