ETV Bharat / state

చివరి భూముల కోసం...ఎత్తిపోతల పథకాలు - telangana news

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలో చివరి భూములకు నీరిచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పరివాహక ప్రాంతాల్ని 3 రోజుల పాటు అధ్యయనం చేసిన విశ్రాంత ఇంజినీర్లు అనువైన ప్రదేశాల్లో ఎత్తిపోతల పథకాలను నిర్మించాలని నివేదికలో పేర్కొన్నారు. రాజవరం, ముది మాణిక్యం, ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ మేజర్ల కింద చివరి భూములకు నీరందకపోవడం వల్ల సీఎం హామీ మేరకు ఇంజినీర్ల బృందం పర్యటన చేపట్టింది.

For the Last Lands Schemes of Lifts in nalgonda
చివరి భూముల కోసం...ఎత్తిపోతల పథకాలు
author img

By

Published : Dec 26, 2019, 4:42 PM IST

ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ 132 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తోంది. కానీ చివరి భూములకు నీరందక సాగుదారులు అవస్థలు పడుతూనే ఉన్నారు. హుజూర్​ నగర్ ఉపఎన్నికలో గెలిచిన అనంతరం జరిగిన విజయోత్సవ సభలో చివరి ఆయకట్టు వరకు నీరందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో విశ్రాంత ఇంజినీర్ల బృందం 3 రోజుల పాటు ఆయకట్టు పరిధిలో పర్యటించింది. ప్రాజెక్టు అధికారులతో కలిసి ఆయా ప్రాంతాల్లో అభిప్రాయాలు సేకరించింది. ముదిమాణిక్యం, వజీరాబాద్, ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ మేజర్ల కింద చివరి భూములకు నీరందాలంటే ఎత్తిపోతల కీలకమని భావిస్తోంది. అన్ని అంశాలు పరిశీలించిన ఇంజినీర్లు 5 ప్రాంతాల్లో ఎత్తిపోతల పథకాలు నిర్మించాలనే యోచనకు వచ్చినట్లు తెలుస్తోంది.

డిమాండ్లు చాలా కాలంగా ఉన్నాయి
రాజవరం మేజర్ పరిధిలోని నెల్లికల్ వద్ద హాలియా వాగు కృష్ణానది కలిసే ప్రాంతంలో ఎత్తిపోతల నిర్మించాలన్న డిమాండ్లు చాలా కాలంగా ఉన్నాయి. రాజవరం కింద 9 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, కాల్వ మొదటి భాగంలో ఉన్న 5 వేల ఎకరాలకు కూడా నీరందడం లేదు. ఆ ప్రాంతంలో నీటి లభ్యత సైతం ఆశాజనకంగా ఉండటం వల్ల ఎత్తిపోతల నిర్మాణానికి ఆ బృందం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఈ ఎత్తిపోతల వ్యయం రూ. 80 కోట్లు ఉండగా, ఇప్పుడది రూ. 120 కోట్లకు చేరుకోనుంది. వజీరాబాద్ ఎల్-8 కింద సైతం చివరి భూములకు నీరందడం లేదు. దీని పరిధిలో 32 వేల ఎకరాలుంటే, ప్రస్తుతం 20 వేల ఎకరాలకు కూడా నీరందట్లేదు. చివరి భూములకు మూసీ నది నుంచి ఎత్తిపోతల నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. దీనిని పరిగణలోకి తీసుకున్న బృందం వంద కోట్లు ఖర్చయ్యే ఎత్తిపోతలపైనే దృష్టిసారించాలని భావించింది.

లక్షా 5 వేల ఎకరాలకు
అటు తుంగపాడు బంధం కృష్ణాలో కలుస్తున్న ప్రాంతంలోనూ ఎత్తిపోతల నిర్మించాలన్న డిమాండ్ ఉంది. అడవిదేవులపల్లి మండలంలోని దున్నపోతుల గండి ఎత్తిపోతలకు రూ. 500 కోట్లు ఖర్చవుతుందని భావిస్తున్నారు. జాన్ పహాడ్ పరిధిలో 36 వేల ఎకరాల ఆయకట్టుకు, 25 వేల ఎకరాలకే నీరందుతోంది. అక్కడ ఎత్తిపోతలకు రూ. 200 కోట్లు ఖర్చు కానుంది. ముక్త్యాల మేజర్ పరిధిలో పులిచింతల వెనుక భాగంలో మట్టపల్లి ఎత్తిపోతల పథకానికి అంకురార్పణ చేయాలని యోచిస్తున్నారు. తద్వారా లక్షా 5 వేల ఎకరాలకు నీరందుతుందని అంచనాకు వచ్చారు.

మొత్తంగా ఈ మూడు ఎత్తిపోతలతో పాటు మరో రెండు కలిపి 5 ఎత్తిపోతల పథకాల ద్వారా 70 వేల ఎకరాలకు నీరందుతుందని అంచనా వేశారు. వీటికి సంబంధించి త్వరలోనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్​ను సిద్ధం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్​కు సమర్పించనున్నట్లు సమాచారం.

చివరి భూముల కోసం...ఎత్తిపోతల పథకాలు

ఇదీ చూడండి : ఓటర్ల జాబితా ఫైనల్​ కాకుండా.. షెడ్యూల్​ ఇస్తారా ఎక్కడైనా: ఉత్తమ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.