ETV Bharat / state

మృతదేహాలను రంగారెడ్డి జిల్లాకు తరలిస్తున్న పోలీసులు

హైదరాబాద్-నాగార్జునసాగర్ రహదారిపై కారు బోల్తా పడి... ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం ధైర్యపురి తండా వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. వాహనంలో లభించిన గుర్తింపు కార్డుల ఆధారంగా హైదరాబాద్​కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పరిధిలోనే జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోలీసులు రంగారెడ్డి జిల్లాకు తరలిస్తున్నారు.

five people died in road accident and bodies shifted rangareddy district
మృతదేహాలను రంగారెడ్డి జిల్లాకు తరలిస్తున్న పోలీసులు
author img

By

Published : Sep 4, 2020, 1:28 PM IST

హైదరాబాద్-నాగార్జునసాగర్ రహదారిపై కారు బోల్తా పడి ఐదుగురు దుర్మరణం పాలైన ఘటనలో... మృతుల వివరాలు లభ్యమయ్యాయి. వాహనంలో లభించిన గుర్తింపు కార్డుల ఆధారంగా హైదరాబాద్​కు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్​కు చెందిన శివభాస్కర్​, శ్రీను యాదవ్​, నాగేంద్ర, భరత్​, శ్రీకాంత్​రెడ్డిలుగా పోలీసులు గుర్తించారు.

నల్గొండ జిల్లా చింతపల్లి మండలం ధైర్యపురి తండా వద్ద ప్రమాదం చోటుచేసుకుని అందరూ ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోగా... మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం దేవరకొండ ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటన జరిగిన ప్రాంతం... నల్గొండ జిల్లా పరిధిలోనిది కాదని పోలీసులు గుర్తించారు. నల్గొండ జిల్లా సరిహద్దుకు ఘటనాస్థలి కేవలం 50 మీటర్ల దూరంలో ఉండటం, రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలానికి చెందినదిగా ఇరు జిల్లాల పోలీసులు నిర్ధరించడం వల్ల కేసును మాడుగుల ఠాణాకు బదిలీ చేశారు. దేవరకొండ దవాఖానాకు తరలించిన మృతదేహాలను... ఆ జిల్లాకు అప్పగిస్తున్నారు.

ఇవీ చూడండి: ప్రమాదం: అదుపుతప్పి కారు బోల్తా.. ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.