నల్గొండ జిల్లా కేంద్రంలో భాస్కర్ థియేటర్ వద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. థియేటర్ ఎదురుగా ఉన్న పావని ట్రేడర్స్‌లో రాత్రి 12.30 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. దాదాపు 30 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో ప్లాస్మా థెరపీకి సన్నాహాలు