ETV Bharat / state

బిల్లుల చెల్లింపులో జాప్యంపై రోడ్డెక్కిన అన్నదాత

నల్గొండ జిల్లాలో ఐకేపీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం బిల్లులు చెల్లించాలంటూ త్రిపురారం రైతులు రోడ్డెక్కారు. రెండు నెలలు గడుస్తున్నా బకాయిలు చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడం వల్ల పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళన చేస్తున్న రైతులకు నచ్చచెప్పి ధర్నా విరమింపజేశారు.

బిల్లుల చెల్లింపులో జాప్యంపై రోడ్డెక్కిన అన్నదాత
author img

By

Published : Jun 11, 2019, 8:09 PM IST

బిల్లుల చెల్లింపులో జాప్యంపై రోడ్డెక్కిన అన్నదాత

అన్నదాతకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి.. పంట వేసేటప్పడు నకిలీ విత్తనాల బెదడ.. పంట మధ్యలో సాగు నీటి కొరత.. పంట పండిన తర్వాత విక్రయం కోసం రైతులు పడే అవస్థలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. పండిన ధాన్యానికి గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా మధ్యవర్తులు మోసగిస్తే.. ఐకేపీ ద్వారా కొనుగోలు చేసినా... ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించక రైతుల నడ్డివిరుస్తోంది.

నల్గొండ జిల్లా త్రిపురారంలో రైతులు రోడ్డెక్కారు. రోజులు గడుస్తున్నా ఐకేపీ కేంద్రాలు ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం బిల్లులు చెల్లించడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీఫ్​ సీజన్​ సమీపిస్తున్నా... రబీలో విక్రయించిన ధాన్యం బిల్లులు ఇంకా చెల్లించలేదని వాపోయారు. ఎప్పడు చెల్లిస్తారో తెలియక గంటల తరబడి బ్యాంకుల ముందు క్యూలో నిలబడాల్సి వస్తుందని అసంతృప్తి వ్యక్తం చేశారు.

జిల్లా వ్యాప్తంగా సగం మంది రైతులకే బిల్లులు చెల్లించారని మిగతా వారి పరిస్థితి దయనీయంగా మారిందని అన్నదాతలు వాపోతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 163 ఐకేపి కేంద్రాల ద్వారా రూ.800 కోట్ల విలువైన సుమారు 4,59,545 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు రూ.500 కోట్లను మాత్రమే రైతుల ఖాతాల్లో జమచేయగా మిగిలిన మొత్తాన్ని చెల్లించేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఖరీఫ్​లో విత్తనాలు కొనేందుకు, కోత మిషన్​ ఖర్చులు, కూలీ డబ్బులు చెల్లించేందుకు సైతం అవస్థలు పడాల్సి వస్తుందని వాపోతున్నారు.

అటు రైతు రుణమాఫీపై స్పష్టత లేకపోవడం వల్ల బ్యాంకులు కొత్త రుణాలు మంజూరు చేసేందుకు వెనకాడుతున్నాయని అన్నదాతలు అంటున్నారు. ఐకేపీ కేంద్రాలు చెల్లించే బిల్లులుపైనే ఖరీఫ్​ సాగు ఆధారపడి ఉందని కర్షకులు చేతులెత్తేస్తున్నారు. అధికారులు మాత్రం మిల్లు ట్యాగింగ్​లో జాప్యం కారణంగా సకాలంలో బిల్లులు చెల్లించలేకపోయామని రెండు మూడు రోజుల్లో నగదు జమచేస్తామని తెలిపారు.

ఇవీ చూడండి: మూడ్రోజుల్లో వస్తుందనుకుంటే... మూణ్నెళ్లైనా ఇవ్వలేదు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.