నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో పేదల భూముల్లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయొద్దని అఖిలపక్ష నేతలు, రైతులు ఆందోళనకు దిగారు. పార్కు ఏర్పాటు వల్ల వాతావరణం కాలుష్యమవుతుందని, చుట్టూ గ్రామాల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
280 ఎకరాల్లోని అసైన్డ్ భూముల్లో నిర్మించనున్న ఇండస్ట్రియల్ పార్కు వల్ల భూగర్భ జలాలు కాలుష్యమవుతాయని వాపోయారు. రైతులు సాగు చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల నుంచి భూములు లాక్కుంటే.. చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.