ETV Bharat / state

కొనుగోలు కేంద్రాల వద్ద రైతన్నల పడిగాపులు.. టోకెన్ల కోసం ధర్నా

సన్న రకం ధాన్యం విక్రయాల కోసం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. ధాన్యం అమ్మేందుకు ప్రభుత్వ ఇస్తున్న టోకెన్లు అందడం లేదని.. అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టోకెన్ విధానం ద్వారా పంట అమ్ముకునేందుకు నానా అవస్థలు పడుతున్నామని.. నల్గొండ జిల్లాలో పలుచోట్ల ఆందోళనకు దిగారు. టోకెన్‌ ఇచ్చిన రోజే పంట కోయాలనే నిబంధన పెట్టడం వల్ల కేంద్రాల వద్ద గంటలపాటు వేచి చూడాల్సి వస్తోందని వాపోయారు.

కొనుగోలు కేంద్రాల వద్ద రైతన్నల పడిగాపులు.. టోకెన్ల కోసం ధర్నా
కొనుగోలు కేంద్రాల వద్ద రైతన్నల పడిగాపులు.. టోకెన్ల కోసం ధర్నా
author img

By

Published : Nov 13, 2020, 5:02 AM IST

కొనుగోలు కేంద్రాల వద్ద రైతన్నల పడిగాపులు.. టోకెన్ల కోసం ధర్నా

ఈ సీజన్‌ ప్రారంభంలోనే ప్రభుత్వం సన్నరకం ధాన్యం పండించాలనే ఆదేశాలతో ఎక్కువమంది రైతులు సన్నరకం వరి సాగుకే మొగ్గుచూపారు. భారీ వర్షాలకు పంటకు దోమపోటు రోగం సోకడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన కొద్దిపంటనైనా అమ్ముకుందామంటే కొనుగోలు కష్టాలు తప్పడం లేదు. పంట కొనేందుకు ప్రభుత్వం జారీ చేస్తున్న టోకెన్లు అందక.. రైతులు నానా అవస్థలు పడుతున్నారు. గంటలు కొద్దీ కొనుగోలు కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. నల్గొండ జిల్లా వేములపల్లిలో టోకెన్లు ఇస్తామని చెప్పిన అధికారులు.. ట్రాక్టర్లలో ధాన్యం తీసుకొచ్చాక ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు.. ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళకు దిగారు. టోకెన్లు జారీ చేయాలని డిమాండ్‌ చేశారు.

కోతలకు వచ్చిన పొలాలను కోసి ధాన్యం తెచ్చుకుంటే టోకెన్లు దొరకక రోడ్లపైనే ఉండాల్సి వస్తోందని.. అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం లోడ్‌ దించాలి లేదంటే ట్రాక్టర్లకు అదనపు కిరాయి ఇవ్వాల్సిందేనని యజమానులు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టోకెన్లు ఇస్తానని చెప్పిన అధికారులు.. కార్యాలయానికి వచ్చాక ఇవ్వడం లేదంటూ.. మిర్యాలగూడ తహసీల్దారు కార్యాలయంలో కర్షకులు ఆందోళనకు దిగారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ.. ఖమ్మం రహదారిపై బైఠాయించారు. టోకెన్ ఉంటేనే కోత మిషన్ యజమానులు పొలం కోయడానికి వస్తున్నారని.. సమయానికి కోయకపోతే పొలాల్లోనే పంట నాశనమయ్యే దుస్థితి ఏర్పడిందని ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. కర్షకుల ఆందోళనకు మద్దతుగా వేములపల్లి మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట భాజపా శ్రేణులు ధర్నా చేశారు. సన్నరకం ధాన్యం అమ్ముకునేందుకు టోకెన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: బాణసంచా నిషేధించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.