ETV Bharat / state

రైతులకి తప్పని తిప్పలు.. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో అవస్థలు - పత్తి విక్రయంలో రైతుల అవస్థలు

రైతన్నకి తిప్పలు తప్పడం లేదు. ఆరుగాలం కష్టపడి పంట చేతికొచ్చేముందు అధిక వర్షాలతో ఓ వైపు నష్టపోతే.. మరోవైపు ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరకి కట్టుబడి ఉండకుండా కొనుగోలు కేంద్రాలు ఇష్టారీతిలో వ్యవహరించడం అన్నదాతలని ఇబ్బందులకు గురిచేస్తోంది. తేమ శాతం అధికంగా ఉందనో.. పేర్లు రిజిస్టర్​ కాలేదనో.. చెప్పిన పంట కాకుండా వేరే పంట పండించారనో ఇలా వివిధ కారణాలతో రైతుల పొట్ట కొడుతున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం లక్ష్మీపురంలోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల్లో పత్తిని విక్రయించడానికి వచ్చిన రైతులు.. అధికారుల తీరుతో నానా అవస్థలు పడుతున్నారు.

farmers problems in selling the cotton
రైతులకి తప్పని తిప్పలు.. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో అవస్థలు
author img

By

Published : Nov 19, 2020, 4:29 PM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం లక్ష్మీపురంలో సీసీఐ సహకారంతో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రంలో రైతులు తాము పండించిన పత్తిని అమ్ముకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. ఈసారి వర్షాల వల్ల పంట దిగుబడి గణనీయంగా తగ్గిందని, మిగిలిన పంటను ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకుందామని కేంద్రానికి వస్తే అధికారులు మోసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తేమ శాతం అధికంగా ఉందని చెప్పి పత్తిని కొనుగోలు చేయడం లేదని, తరుగు పేరిట పత్తిని తీసేస్తున్నారని వాపోతున్నారు. సీసీఐ నిబంధనల ప్రకారం తేమ శాతం 8 నుంచి 12 వరకు ఉన్న పత్తినే కొనుగోలు చేయాలని ఉంది. ఈ నేపథ్యంలో పత్తి లోడు ట్రాక్టర్ బోరెం పై భాగంలో కాకుండా కింది భాగంలో అధికారులు తేమశాతం చూస్తున్నారు. దీంతో కింది భాగంలో తేమ శాతం అధికంగా వస్తుండటంతో దానిని సాకుగా చూపి మద్దతు ధరను ఇవ్వడం లేదని రైతులు ఆరోపించారు.

వివరాల నమోదు లేదు

మొదటి పింజరకం పత్తికి రూ. 5,825గా, రెండవ పింజరకానికి రూ. 5,775 గా, తేమ శాతం 10 నుంచి 12 వరకు ఉండే మూడవ పింజరకం పత్తికి రూ. 5,725 గా ధరలను నిర్ణయించి సీసీఐ ద్వారా కొనుగోలు చేయాల్సి ఉండగా ఆ ధర ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నారు. కాగా స్థానిక సీసీఐ కేంద్రాల్లో వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులు పండించిన పంట వివరాలను నమోదు చేయాల్సి ఉండగా ఎక్కడా ఆ విధంగా జరగడం లేదు. దీనివల్ల రైతుల పంట వివరాలు అంతర్జాలంలో లేకపోవడంతో మద్దతు ధరకు సీసీఐ కేంద్రాల్లో పత్తిని అమ్ముకునే అవకాశాన్ని రైతు కోల్పోతున్నాడు.

అధికారుల అలసత్వం

దామరచర్లలో ఓ రైతు నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేయగా దానిని అమ్ముకోవడానికి కేంద్రానికి వెళ్తే ఆన్​లైన్​లో ఆ రైతు వరి సాగు చేసినట్లుగా ఉంది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆవేదన చెందుతున్నాడు. అధికారులు నిర్లక్ష్యంగా పని చేయడం వల్లనే తనకీ పరిస్థితి వచ్చిందని వాపోతున్నాడు.

దయనీయ స్థితిలో కౌలు రైతులు

సొంత పొలం రైతుల సంగతే ఇలా ఉంటే ఇక కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆన్​లైన్​లో కౌలు రైతుల పేర్లు లేకపోవడంతో పత్తి కొనుగోలు కేంద్రాల్లో తమ పంటను అమ్ముకునే అవకాశం వారికి లేకుండా పోయింది. తప్పని పరిస్థితుల్లో దళారులకు అమ్ముకుంటున్నారు. తమకు పత్తి అమ్మకాలకై తాత్కాలిక రిజిస్ట్రేషన్ కల్పించి ఆన్​లైన్​లో నమోదు చేసుకునేలా చూడాలని కౌలు రైతులు కోరుతున్నారు.

ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

ఇవన్నీ తెలియని రైతులు.. ఇక్కడకు వచ్చిన తర్వాత పత్తిని కొనబోమని అధికారులు చెప్పడంతో ట్రాక్టర్ కిరాయి, ఎగుమతి, దిగుమతులకు చాలా ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలకు పంట నష్టపోగా.. మిగిలిన పత్తిని అమ్ముకుందామని సీసీఐ కేంద్రానికి వస్తే అధికారులు నానా కొర్రీలు పెడుతున్నారని వాపోతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి తప్పిదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అంటున్నారు. వ్యవసాయాధికారులు గ్రామాల్లో పర్యటించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి: దేశం మొత్తం తెలంగాణ​ వైపు చూస్తోంది: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.