ETV Bharat / state

సన్నధాన్యానికి టోకెన్ల కోసం అన్నదాతల పడిగాపులు.. - నల్గొండ జిల్లా రైతుల కష్టాలు వార్తలు

ధాన్యపు టోకెన్ల కోసం ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా.. రైతులు బారులు తీరుతూనే ఉన్నారు. ఆకలితో అలమటిస్తూ గంటల పాటు నిరీక్షిస్తున్న తీరు.. దయనీయంగా తయారైంది. అయినా టోకెన్లు దక్కక.. నిరాశతో వెనుదిరుగుతున్నారు. మరోవైపు దీపావళి సందర్భంగా శనివారం కొనుగోళ్లకు, టోకెన్ల జారీకి సెలవు ప్రకటించారు.

సన్నధాన్యానికి టోకెన్ల కోసం అన్నదాతల పడిగాపులు..

author img

By

Published : Nov 14, 2020, 10:18 AM IST

సన్నధాన్యానికి టోకెన్ల కోసం అన్నదాతల పడిగాపులు..

సన్నధాన్యాన్ని అమ్ముకునేందుకు సాగుదారులు.. తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇచ్చే అరకొర టోకెన్ల కోసం.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారు. దీంతో మండల కార్యాలయాల వద్ద.. జన సందోహం నెలకొంటోంది. అయితే జారీ ప్రక్రియలో సరైన తీరును అనుసరించకపోవడం వల్ల రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. టోకెన్లు అందజేసేందుకు గాను ముందుగా రశీదులు ఇస్తున్నారు. ఆ రశీదుల్లో ఉన్న తేదీ ప్రకారం వస్తే.. టోకెన్లు అందజేస్తున్నారు. కానీ నాలుగు వందల మంది పేర్లు నమోదు చేయించుకుంటే.. అందులో వంద మందికి మాత్రమే టోకెన్లు ఇస్తున్నారు. దీనిపై కర్షకుల్లో తీవ్ర ఆవేదన కనిపిస్తోంది.

వేములపల్లి ఎంపీడీవో కార్యాలయంలో.. టోకెన్ల కోసం ఉదయం నుంచే బారులు తీరారు. తిండీతిప్పలు మాని.. వాటి కోసమే గంటల పాటు వరుసలో ఉంటున్నారు. అయినా టోకెన్లు దక్కక.. నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇక మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్లోనూ అదే తీరు కనిపించింది. శుక్రవారం కొత్తగా పేర్లు నమోదు చేసుకునేందుకు.. రెండు వందల మందికి పైగా వచ్చారు. అయితే వారికి రశీదులు ఇచ్చే విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల ఇస్తారనే ఆశతోనే ఆరు గంటలపాటు నిరీక్షించారు. ఈటీవీ-ఈనాడు ద్వారా విషయం తెలుసుకున్న ఆర్డీవో రోహిత్ సింగ్.. అప్పటికప్పుడు అందరికీ రశీదులు ఇచ్చేలా చేశారు. అయితే టోకెన్ల కోసం జరుగుతున్న తంతుపై.. కర్షకుల్లో తీవ్ర ఆవేదనతోపాటు ఆగ్రహం కనిపిస్తోంది.

అటు సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ వద్ద కూడా.. పెద్దసంఖ్యలో రైతులు గుమికూడారు. టోకెన్ల కోసం గంటల పాటు ఎదురుచూపులు తప్పలేదు. దీంతో మార్కెట్ ఎదుట భాజపా శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. మునగాల మండల సర్వసభ్య సమావేశానికి హాజరైన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్న ఉత్తమ్.. ఏకకాలంలో లక్ష రుణాన్ని మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

ఇలా రైతుల ఆందోళనతో.. అన్నిచోట్లా ఇబ్బందికర వాతావరణమే కనిపిస్తోంది. దీపావళి సందర్భంగా శనివారం కొనుగోళ్లకు, టోకెన్ల జారీకి సెలవు ప్రకటించారు.

ఇదీ చదవండి: కొనుగోలు కేంద్రాల వద్ద రైతన్నల పడిగాపులు.. టోకెన్ల కోసం ధర్నా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.