ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా జోరువాన కురుస్తోంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. కొన్నిచోట్ల భారీ వర్షాలు పడుతుండగా.. మరికొన్ని చోట్ల ముసుర్లతో ఆకాశమంతా మేఘావృతమై ఉంది.
వర్షాలు పడుతుండడం వల్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాగు చేయడానికి ఉత్సాహం కనపరుస్తున్నారు. పత్తి చేలల్లో కలుపు తీయటాలు, పంట చేలకు ఎరువులు వేయడం వంటి పొలం పనుల్లో మునిగిపోయి ఆనందంగా చేస్తున్నారు.
ఇవీ చూడండి: వ్యవసాయ శాఖ క్రియాశీలకంగా మారాలి: సీఎం