నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రపోలు వీఆర్ఏ విజయ్ అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని మిర్యాలగూడ ఆర్డీవోకి రైతులు ఫిర్యాదు చేశారు. పట్టాదారు పాసు పుస్తకాల్లో భూమి వివరాలు నమోదు చేస్తానని రైతుల నుంచి డబ్బులు వసూలు చేసి ఇబ్బందులు పెడుతున్నాడని అన్నారు.
ఆ విషయం అడగడానికి వెళ్లిన రైతులు తనను వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారని చెబుతున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆర్డీవోకి వినతిపత్రం అందించారు.
ఇదీ చూడండి : లాక్డౌన్ 5.0 రూల్స్‌పై రాష్ట్రాల మాటే ఫైనల్!