నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో కొలుపు చెప్పే కొందరు స్వాములను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నలుగురు నకిలీ విలేకర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 2న వచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ నకిలీ బ్యాచ్ ఆట కట్టించారు. వారి నుంచి ఒమిని మినీ వ్యాన్ , ఎస్10 న్యూస్ లోగో, సీ1 లోగోలు, ఒక వీడియో కెమెరా స్వాధీనం చేసుకున్నారు. ఆ నలుగురు నకిలీ విలేకరులు హైదరాబాద్‌లోని ఎల్బీనగర్కు చెందిన శివకుమార్, నల్ల పాపయ్య, బొంగు శివశంకర్, బోయిని వెంకటేశ్‌లుగా గుర్తించారు.
- ఇదీ చూడండి : మైనర్ల డ్రైవింగ్‌పై ప్రత్యేక నిఘా