రాష్ట్రంలోని ప్రజల సమస్యల కోసం ఉన్నత ఉద్యోగానికి రాజీనామా చేయడం ఆనందంగా ఉందని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నారు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో బుధవారం ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బహుజనులకే రాజ్యాధికారం రావాలని చెప్పారు. ఈ నెల 8న నల్గొండలో బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించే సభ దేశ చరిత్రలో నిలవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో మాయావతి ప్రధాని అవడానికి ఈ సభ సంకేతం కావాలని ఆశించారు.
ప్రలోభాలకు గురి కావద్దు
70 ఏళ్లుగా బహుజనులు అణచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా మేల్కొందామని కార్యకర్తలకు స్పష్టం చేశారు. తెలంగాణలో పెత్తందారీతనం పోవాలంటే బహుజనులకే రాజ్యాధికారం రావాలని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయంలో డబ్బు వంటి ప్రలోభాలకు లొంగవద్దని కోరారు.
బహిరంగ సభల్లో తాను మాట్లాడేటప్పుడు ఇప్పటికే మూడు సార్లు పవర్ కట్ అయిందని ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పవర్ కట్ చేసే రోజులు దగ్గర పడ్డాయని తెరాస ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు.
ఆర్.ఎస్ ట్వీట్
‘‘ఇప్పటికి వరుసగా మూడు సభల్లో సరిగ్గా నా స్పీచ్ టైమ్‌లోనే పవర్ కట్ అయింది. నాతో మాట్లాడుతున్న వ్యక్తులపై నిఘా సంగతి ఇక చెప్పనక్కరలేదు. మా శ్రమను దోపిడీ చేసి కట్టుకున్న మీ రాజప్రాసాదాలకు తెలంగాణ ప్రజలు పవర్‌కట్ చేసే రోజులు దగ్గరపడ్డాయి. దయచేసి గుర్తుంచుకోండి’’ అంటూ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ బుధవారం ట్వీట్ చేశారు.
-
ఇప్పటికి వరుసగా మూడు సభల్లో సరిగ్గా నా స్పీచ్ టైంలోనే పవర్ కట్ అయింది. నాతో మాట్లాడుతున్న వ్యక్తులపై నిఘా సంగతి ఇక చెప్పనక్కరలేదు. మా శ్రమను దోపిడి చేసి కట్టుకున్న మీ రాజప్రసాదాలకు తెలంగాణ ప్రజలు పవర్ కట్ చేసే రోజులు దగ్గర పడ్డాయి. దయచేసి గుర్తుంచుకోండి.✊✊✊ pic.twitter.com/BXRN5yEBqY
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) August 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఇప్పటికి వరుసగా మూడు సభల్లో సరిగ్గా నా స్పీచ్ టైంలోనే పవర్ కట్ అయింది. నాతో మాట్లాడుతున్న వ్యక్తులపై నిఘా సంగతి ఇక చెప్పనక్కరలేదు. మా శ్రమను దోపిడి చేసి కట్టుకున్న మీ రాజప్రసాదాలకు తెలంగాణ ప్రజలు పవర్ కట్ చేసే రోజులు దగ్గర పడ్డాయి. దయచేసి గుర్తుంచుకోండి.✊✊✊ pic.twitter.com/BXRN5yEBqY
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) August 4, 2021ఇప్పటికి వరుసగా మూడు సభల్లో సరిగ్గా నా స్పీచ్ టైంలోనే పవర్ కట్ అయింది. నాతో మాట్లాడుతున్న వ్యక్తులపై నిఘా సంగతి ఇక చెప్పనక్కరలేదు. మా శ్రమను దోపిడి చేసి కట్టుకున్న మీ రాజప్రసాదాలకు తెలంగాణ ప్రజలు పవర్ కట్ చేసే రోజులు దగ్గర పడ్డాయి. దయచేసి గుర్తుంచుకోండి.✊✊✊ pic.twitter.com/BXRN5yEBqY
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) August 4, 2021
ఇదీ చదవండి: AP ON Krishna: మధ్యవర్తిత్వానికి ఏపీ విముఖత.. తప్పుకున్న సీజేఐ ఎన్వీ రమణ