ప్రలోభాలకు గురికాకుండా ఓటేయాలని ఈటీవీ భారత్ - ఈనాడు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
నల్గొండ జిల్లా చండూర్ మున్సిపాలిటీలోని స్థానిక క్రిష్ణవేణి పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి స్థానిక సీఐ సురేష్ కుమార్, ఎన్నికల ప్రత్యేక అధికారి శ్రీనివాసమూర్తి హాజరయ్యారు. ఓటు హక్కు ప్రత్యేకతను విద్యార్థులకు వివరించారు.