లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన 12 వందల మంది ఆటో డ్రైవర్లకు నల్గొండ జిల్లా, మిర్యాలగూడలో బీఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేత కుందూరు జానారెడ్డి నిత్యావసరాలు అందచేశారు. కరోనాను నిర్మూలించడానికి ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు, వైద్య సిబ్బంది పాటుపడుతున్నప్పటికి… ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజలకు అరకొర సదుపాయాలే అందుతున్నాయని అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి మిర్యాలగూడ నియోజకవర్గంలో కరోనా బాధితులకు తానున్నానంటూ సహాయం అందించడం ఎంతో అభినందనీయమని అన్నారు.
గత కొద్ది రోజులుగా బత్తుల లక్ష్మారెడ్డి పేదవారికి నిత్యావసరాలు, కరోనా బాధితులకు కరోనా కిట్లను పంపిణీ చేస్తూ వారికి మనోధైర్యాన్ని కలిగిస్తున్నారని అన్నారు. పార్టీలు, కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ తరఫున బీఎల్ఆర్ చేసే సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, చిరుమర్రి కృష్ణయ్య, పొదిళ్ల శ్రీనివాస్, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: Petrol price: రికార్డు స్థాయికి పెట్రోల్, డీజిల్ ధరలు