నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ కుడి కాలువలో ఊడిపోయిన 9వ నెంబర్ గేటును ఇంజినీర్ ఇన్ చీఫ్ నాగేందర్ పరిశీలించారు. ఈ నెలాఖరులోగా గేటును ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సీజన్‌లో జలాశయంలోకి నీటి ప్రవాహం అధికంగా రావడం వల్ల గతంలోనే కుడి కాలువ 9వ నెంబర్ గేట్ లాక్ అయ్యింది.
నీటి ప్రవాహం తగ్గిన తర్వాత మరమ్మతులు చేపట్టాలని అధికారులు భావించారు. వారం రోజులకిందట ఆ గేటు ఊడిపోయింది. నీరు వృథాగా పోవడం వల్ల అధికారులు గేటు మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. నాగార్జున సాగర్ జలాశయం స్పిల్ వే పనులతో పాటు మిగతా పనులకు అతి త్వరలో నిధులు అందేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'ఎమ్మెల్సీ' ఓట్ల లెక్కింపు రోజున 144 సెక్షన్: సీపీ మహేశ్ భగవత్