ETV Bharat / state

అర్హులను తొలగించి.. అనర్హులకు కేటాయించారు..

నల్గొండ జిల్లాలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు పరిహారం పంపిణీలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. నిర్వాసితుల జాబితాలో అర్హుల పేర్లు తొలగించి.. అనర్హులకు పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అవినీతిలో మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయంలోని ఇద్దరు అధికారులు కీలకంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి.

eligibility-and-disqualification-in-themalplant-project
అర్హులను తొలగించి.. అనర్హులకు కేటాయించారు..
author img

By

Published : Feb 18, 2020, 5:18 AM IST

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్‌ ప్రాజెక్టు నిర్మాణం వల్ల సమీపంలో ఉన్న మెదుగులకుంట తండాలో 87, కపూర్‌తండాలో 86 కుటుంబాలు సర్వస్వం కోల్పోతున్నాయి. వీరికి మెరుగైన పునరావాసం ప్యాకేజీ కల్పించాల్సిన అవసరం ఉందని.... జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా ఉండే 'రిహాబిలిటేషన్ రీ సెటిల్మెంట్ కమిటీ ' 2016 ఫిబ్రవరి 18న తీర్మానించింది.

అర్హులను తొలగించి.. అనర్హులకు కేటాయించారు..

ప్రభుత్వం హామీ విస్మరించింది

నిర్వాసితులు అందరికీ గతంలోనే తొలివిడతగా పునరావాస ప్యాకేజీ ఇచ్చారు. ఇల్లు కోల్పోతున్న వారికి సమీపంలోని శాంతినగర్‌లో తాజాగా ప్లాట్లు ఇచ్చారు. అర్హులైన వారికి ప్రాజెక్టు నిర్మాణంలోనే ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

మిర్యాలగూడ ఆర్డీఓ కేంద్రంగా అవకతవకలు

పునరావాస ప్యాకేజీ అర్హుల జాబితాలో ఉన్న రూపావత్ సరిత, హరిత, నేనావత్ లలిత పేర్లను తొలగించారు. నిర్వాసితులుకానీ వారి పేర్లను అధికారులు జాబితాలో చేర్చారు . మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు.... కపూర్ తండాకు చెందిన ఓ దళారి ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారని సమాచారం.

అవినీతి దందా

ఈ విషయమై బాధితులు నల్గొండ కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారులకు ప్రభావితమై అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని గ్రామస్థులు ఆరోపించారు . సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

ఇవీ చూడండి: దేశ ఫార్మా రాజధానిగా హైదరాబాద్​: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.