చిన్న వయస్సులో తల్లితండ్రులు కోల్పోయిన ముగ్గురు పిల్లలకు ఆర్ధిక సహాయం చేస్తూ... దాతల దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. యాద్రాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరుకు చెందిన గట్టు సత్తయ్య సంవత్సరం క్రితం మరణించగా... అతని భార్య గట్టు అనురాధ జులై 28న అనారోగ్యంతో మరణించారు. వారి పిల్లలు మనోహర్, లాస్య, యశ్వంత్ అనాథలయ్యారు. అనాథలుగా మారిన పిల్లలను ఆదుకోవాలంటూ... మీడియాలో వచ్చిన కథనాలు చూసి కొందరు దాతలు ముందుకొచ్చారు.
ఆత్మకూర్ మాజీ సర్పంచ్ బీసు చందర్ గౌడ్... చిన్నారులను పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. భవిష్యత్లో పిల్లల చదువుల కోసం సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. 2001-02 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు పిల్లలకు... రూ.13 వేలు, 4 జతల బట్టలు అందజేశారు. 2005-06 సంవత్సర పూర్వ విద్యార్థిని తుమ్మల స్నేహ నరేష్ రెడ్డి... రూ.10 వేలు అందించారు. మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన సింగిల్ విండో డైరెక్టర్, సర్వాయి పాపన్న మోకు దెబ్బ జిల్లా అధ్యక్షులు ఆకుల వెంకటేశం గౌడ్ రూ.5 వేలు అందించారు.
దాతృత్వం చాటుకున్న దాతలు.. చిన్నారులకు చేయూత - అనాథలకు దాతల దాతృత్వం
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు గ్రామానికి గట్టు సత్తయ్య-అనురాధ మృతితో... వారి పిల్లలు అనాథలయ్యారు. ఆదుకోవాలంటూ పత్రికల్లో వచ్చిన కథనాలతో స్పందించి కొందరు దాతలు ముందుకు వచ్చి దాతృత్వం చాటుకున్నారు.