నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన దుబ్బాక అమరేందర్‌రెడ్డి అమెరికాలో స్థిరపడ్డారు. లాక్ డౌన్ నేపథ్యంలో స్వగ్రామంలో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు తన వంతు సాయంగా నిత్యవసరాలు అందజేస్తున్నారు. ఎన్నారై అమరేందర్‌రెడ్డి ఆర్థిక సాయంతో ఏఎంఆర్ యూత్ సభ్యులు నిత్యం కూరగాయలు, కోడిగుడ్లు ప్రజలు అందిస్తున్నారు. ప్రజలు కూడా సామాజిక దూరం పాటిస్తూ, ముఖాలకు మాస్కులు ధరించి నిత్యవసరాలు స్వీకరిస్తున్నారు. ఏఎంఆర్ యూత్ తరపున తమకు నిత్యం కూరగాయలు అందిస్తున్న అమరేందర్‌రెడ్డి దాతృత్వాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక రజినీకాంత్‌రెడ్డి, ఏఎంఆర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
ఎన్ఆర్ఐ ఔదార్యం..నిరుపేదలకు చిరుసాయం - నిత్యం కూరగాయలు, కోడిగుట్లు పంపిణీ
విదేశాల్లో ఉన్నా స్వగ్రామంలోని పేదలకు తన వంతు సాయం చేస్తున్నాడో ఎన్నారై. లాక్డౌన్ నేపథ్యంలో తిండికి ఇబ్బంది పడుతున్న వారికి కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీ చేస్తున్నాడు.