నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం జరిగింది. పట్టణంలోని దంత వైద్యురాలు శ్వేత ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వేదింపుల వల్లే తమ బిడ్డ బలవన్మరణానికి పాల్పడిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
మృతురాలు రాసిన సూసైడ్ నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన పాపని అత్త వద్దనే ఉంచాలని... తన పేరున ఉన్న ఆస్తిని పాపకి ఇవ్వాలని సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. తన మరణానికి ఎవ్వరూ బాధ్యులు కారని ఎవ్వరిపైన కేసు పెట్టొద్దని లేఖలో రాసినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: సిద్దిపేట జిల్లాలో ఈతకు వెళ్లి హైదరాబాద్ యువకుడి గల్లంతు