ETV Bharat / state

ఎన్నికల కోడ్ తెచ్చిన కష్టాలు - students suffered lack of felicities

దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వలేదన్న చందంగా తయారయింది మునుగోడులోని పాఠశాలల్లో వసతుల కల్పన పరిస్థితి. తరగతుల నిర్మాణం కోసం నిధులు మంజూరైనా వరుస ఎన్నికల కోడ్​ వల్ల పనులు ప్రారంభానికి నోచుకోలేదు. శిథిలావస్థకు చేరిన భవనాల్లో బిక్కు బిక్కు మంటూ విద్యార్థులు కాలం వెల్లదీస్తున్నారు.

ఎన్నికల కోడ్ తెచ్చిన కష్టాలు
author img

By

Published : Jul 25, 2019, 11:26 PM IST

ఎన్నికల కోడ్ తెచ్చిన కష్టాలు

నల్గొండ జిల్లా మునుగోడు పాఠశాలలో తరగతి గదులు దుర్భరంగా ఉన్నాయి. స్థానిక ఉన్నత పాఠశాల, కస్తూర్బా విద్యాలయంలో సరిపడా గదులు లేక విద్యార్థుల అవస్థలు వర్ణణాతీతం. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా పాఠశాల అభివృద్ధికి నిధులు మంజూరైనా వరుస ఎన్నికల కోడ్​ల వల్ల పనులు కదలడం లేదు.

నిధులున్నాయ్​ కానీ..

మునుగోడు జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాలలోని 20 తరగతి గదుల్లో 15 శిథిలావస్థకు చేరాయి. అదనపు గదుల కోసం జిల్లా కలెక్టర్​ ఉత్తర్వులపై ఖనిజాభివృద్ధి సంస్థ రూ. 68 లక్షలు, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్​ 72 లక్షల నిధులను గతేడాదే మంజూరు చేసింది. గదుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనితో పాటు కస్తూర్బా కళాశాల భవన నిర్మాణం కోసం కూడా గతేడాది అక్టోబరులో సర్వశిక్ష అభియాన్​ రూ. 1.35 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో వీటికి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేశారు. కానీ ఎన్నికల కోడ్​ వల్ల పనులు ప్రారంభం కాలేదు.

తరగతి గదిలోనే రాత్రి బస

చిన్నపాటి వర్షమొచ్చినా విద్యార్థులకు నిలువ నీడలేని పరిస్థితి. శిథిలమైన గదుల్లో బిక్కుబిక్కుమంటూ చదువు సాగిస్తున్నారు. భారీ వర్షమొస్తే కూలే స్థితిలో ఉన్నాయి. కస్తూర్బా కాలేజీలో గతేడాది ఇంటర్​ ప్రవేశ పెట్టారు. ఈ ఏడాది మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులతో తరగతి గదులు సరిపోవడం లేదు. కనీసం భోజనం వండే గదికూడా సరిగా లేక చెట్టుకిందే వండి పెట్టాల్సిన దుస్థితి. విద్యార్థినులకు వసతి గదులు లేక తరగతి గదుల్లోనే రాత్రి బస చేస్తున్నారు. మరుగుదొడ్లు లేక నరకం అనుభవిస్తున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు. నిధులు లేక చాలా చోట్ల పనులు నిలిచిపోతుంటే అన్నీ ఉన్నా వరుస ఎన్నికలతో వారికీ కష్టమొచ్చింది.

ఇదీ చూడండి: గురుకుల పాఠశాల విద్యార్థులకు తప్పిన ప్రమాదం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.