రేపు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న దళిత భేరి బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని పార్టీ నేతలు తెలిపారు. నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పట్టణంలో ఈ సభ జరగనుంది. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులు, విద్యావేత్తలు, మేధావులు, నిరుద్యోగులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. దళితులకు జరుతున్న అన్యాయాలు, వారికి కేసీఆర్ ఇచ్చిన మోసపూరిత హామీలపై సమావేశంలో షర్మిల ప్రసంగించనున్నట్లు వారు తెలిపారు.
ఇదీ చదవండి: YS SHARMILA: "దళిత భేరి" సభకు మందకృష్ణ మాదిగను ఆహ్వానించిన షర్మిల