నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవడానికి మనకోసం-మన ఛైర్మన్ అనే కార్యక్రమాన్ని మున్సిపల్ ఛైర్మన్ తిరునగరు భార్గవ్ చేపట్టారు. మున్సిపాలిటీలోని ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు భార్గవ్ తెలిపారు. ఫోన్ ద్వారా వచ్చిన వినతులపై చర్చించి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుంచి 12.30 గంటల వరకు 9848086262 నెంబర్కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. వారి సమస్యలు నమోదు చేసుకుని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని వెల్లడించారు.
ఇవీ చూడండి: ఫ్లాయిడ్ నిరసనలు: ఇసుకేస్తే రాలనంత జనం!