నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. తొలిఏకాదశితో పాటు శుక్రవారం కావటం వల్ల భక్తులు పోటెత్తారు. స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోనేటిలో స్నానాలు చేసి దీపాలు వెలిగించారు. శివసత్తుల నృత్యాలు, శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇవీ చూడండి: చివరి దశకు చేరుకున్న యాదాద్రి నిర్మాణం