నిన్న జరిగిన ఐపీఎల్ క్వాలీఫ్యాయర్-1లో భాగంగా చెన్నై- ముంబాయి జట్టుకు మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెద్ద మొత్తంలో బెట్టింగ్ రాయళ్లు రెచ్చిపోయారు. దీనిలో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో బెట్టింగ్‌లు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు సోదాలు నిర్వహించారు. చీదెళ్ల శ్రీకాంత్ తన ఇంట్లో స్నేహితులతో బెట్టింగ్ ఆడుతున్నారని తెలిసి ఆయనతో పాటు మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 2,58,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే 12 చరవాణులు కూడా జప్తు చేశారు.
ఇవీ చూడండి: చెన్నై బ్యాట్స్‌మెన్‌పై ధోని ఆగ్రహం..!