నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో వృద్ధ దంపతులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆ మందులు కూడా కొనుక్కోలేనంత స్థితిని తాళలేక వారు పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత కొంతకాలంగా సరికొండ జానకమ్మ చర్మవ్యాధితో బాధపడుతుండగా.. అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగినా నయమవ్వకపోవడం, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవగా.. దిక్కుతోచని స్థితిలో బతుకుదెరువు లేక మనస్తాపానికి గురయ్యారు.
అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తాళలేక.. శుక్రవారం వారిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిని గమనించిన కుటుంబసభ్యులు... వెంటనే చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దంపతులిద్దరూ చికిత్స పొందుతూ మరణించారు.
ఇదీ చూడండి:మహారాష్ట్రలో ఒక్కరోజే కరోనాతో 258 మంది మృతి