Cotton theft in Chandur mandal: నల్గొండ జిల్లా చండూర్ మండలం బంగారిగడ్డ గ్రామంలో దుండగులు నిన్న రాత్రి పత్తి పంటను చోరీ చేశారు. బాధిత రైతు వర్కాల బిక్షమయ్య 7 ఎకరాల భూమిలో పంట సాగు చేయగా.. 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ఇంటి వద్ద స్థలం లేకపోవడంతో పంటను రైతు తన వ్యవసాయ భూమిలో ఉన్న షెడ్డులో భద్రపరిచాడు. ఇదే అదనుగా భావించిన దుండగులు.. నిన్న రాత్రి తమ వెంట తెచ్చుకున్న వాహనంలో సుమారు 25 క్వింటాళ్ల పత్తిని దోచుకెళ్లారు.
చోరీకి గురైన పత్తి విలువ సుమారు రూ.లక్షా 80 వేల వరకు ఉంటుందని రైతు వాపోయాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీ చదవండి: