ETV Bharat / state

పత్తి రైతులకు.. కొత్త పరికరం - వ్యవసాయ రంగం

వ్యవసాయ రంగంలో వచ్చే విప్లవాత్మక మార్పులు రైతుకు మరింత ఉపయోగకరంగా మారుతున్నాయి. నల్గొండ జిల్లా కంపసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం తాజాగా రూపొందించిన యంత్రం పత్తిరైతుకు ఎంతో ఉపయోగకరంగా ఉంది.

cotton shredder machine
పత్తి రైతులకు.. కొత్త పరికరం
author img

By

Published : Feb 19, 2020, 12:42 AM IST

పంట అయిపోయిన తర్వాత మిగిలిపోయిన పత్తికట్టెను తొలగించకపోవడం వల్ల పత్తిరైతులు నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. పత్తికట్టె తొలగించకపోవడం వల్ల గులాబీరంగు పురుగు తర్వాతి పంట వరకు ప్రాణాలతో ఉంటుంది. దీంతో.. కొత్త పంటకు పురుగు సోకి పంట నష్టానికి కారణమవుతున్నది.

దీనికి చెక్ పెట్టడానికి శక్తిమాన్ అనే ప్రైవేటు సంస్థ కాటన్ షెడ్డర్ యంత్రాన్ని కనిపెట్టింది. ఇది.. పత్తికట్టెను ముక్కలు ముక్కలు చేస్తుంది. ఈ యంత్రాన్ని నల్గొండ జిల్లాలోని కంపసాగర్ కృషి విజ్ఞానకేంద్రం వారు రూపొందించారు. త్వరలోనే.. ఈ యంత్రాన్ని తెలంగాణలోని అన్ని జిల్లాలకు పరిచయం చేసి.. రైతులకు అందుబాటులోకి తేనున్నారు. ఈ కాటన్ షెడ్డర్ యంత్రం దాదాపు లక్షన్నర రూపాయలకు మార్కెట్లో అందుబాటులో ఉండనుంది. ఈ యంత్రంతో గంటన్నరలో ఎకరం విస్తీర్ణంలో పత్తికట్టెను తొలగించవచ్చు. ఇందుకు ఆరు నుంచి ఏడు లీటర్ల డీజిల్ ఖర్చవుతుంది.

ఈ యంత్రాన్ని ఎలా ఉపయోగించాలో.. రైతులకు వివరించడంతో పాటు.. సకాలంలో పత్తికట్టె తీయకపోవడం వల్ల సంభవించే నష్టాలను కూడా రైతులకు అర్థమయ్యేలా చెప్తున్నారు కృషి విజ్ఞానకేంద్రం వారు. కాటన్ షెడ్డర్ వల్ల పత్తిమొక్కలు సులభంగా ముక్కలు ముక్కలుగా చేయడంతో పాటు భూమిలో కలిసిపోయేలా చేస్తుంది. ఈ యంత్రాన్ని వాడడం వల్ల కూలీల కొరతను కూడా అధిగమించవచ్చంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు.

పత్తి రైతులకు.. కొత్త పరికరం

ఇవీ చూడండి: దక్షిణాసియా బెస్ట్ డిజిటల్ న్యూస్ స్టార్టప్ 'ఈటీవీ భారత్‌'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.