ETV Bharat / state

వచ్చే నెల 1 వరకు పత్తి కొనుగోళ్లు నిలిపివేత.. ఆందోళనలో రైతులు..

అసలే ఆలస్యంగా ప్రారంభమైన పత్తి కొనుగోళ్లకు.. క్రమంగా అవాంతరాలు ఎదురవుతున్నాయి. వరుసగా ఐదు రోజుల పాటు కొనుగోళ్లు ఆపేస్తామని సీసీఐ ప్రకటించటంతో.. ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు అయోమయంలో పడిపోయారు. మళ్లీ వచ్చే నెల 1 నుంచి కొనుగోళ్లు ఉంటాయని.. అప్పటివరకు సరకు తీసుకురావొద్దని అధికారులు స్పష్టం చేశారు.

cotton purchase temporarily stop in nalgonda district
వచ్చే నెల 1 వరకు పత్తి కొనుగోళ్లు నిలిపివేత.. ఆందోళనలో రైతులు..
author img

By

Published : Nov 26, 2020, 5:03 AM IST

వచ్చే నెల 1 వరకు పత్తి కొనుగోళ్లు నిలిపివేత.. ఆందోళనలో రైతులు..

గత నెలలో కురిసిన వర్షాల వల్ల ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే పెద్దయెత్తున పత్తి పంటను కోల్పోయిన రైతులకు.. తాజాగా కొనుగోళ్లు నిలిచిపోవడం ఇబ్బందికరంగా మారుతోంది. మిగిలిన పంటను అమ్ముకుందామంటే.. తరచూ ఏదో ఒక అడ్డంకి ఎదురవుతోంది. ఈ నెల 26 నుంచి 30 వరకు ఐదు రోజుల పాటు కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు సీసీఐ ప్రకటించింది. 26న సార్వత్రిక సమ్మె... 27, 28న తుపాను ప్రభావం... 29 ఆదివారం... 30 సోమవారం నాడు కార్తిక పౌర్ణమి దృష్ట్యా సీసీఐ కేంద్రాలకు సెలవు ఇస్తున్నట్లు నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ప్రకటనలు విడుదలయ్యాయి. ఇలా వరుసగా ఐదు రోజుల పాటు కొనుగోళ్లు నిలిచిపోవటంతో.. రైతులు నిరాశలో ఉన్నారు. డిసెంబరు 1 నుంచి విక్రయాలు పునఃప్రారంభమవుతాయని తెలియజేయటంతో.. వాతావరణ ప్రభావానికితోడు, సరకును నిల్వ చేసే పరిస్థితి లేక అయోమయంలో పడిపోయారు.

60 శాతం తెల్లబంగారం దెబ్బతింది

అక్టోబరు 13న కురిసిన భారీ వర్షాలతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా... 60 శాతం తెల్లబంగారం దెబ్బతింది. మిగిలిన ఆ అరకొర పంటనైనా అమ్ముకుందామంటే.. దానికీ తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అక్టోబరులో ప్రారంభం కావాల్సిన సీసీఐ కేంద్రాలు నెల ఆలస్యంగా మొదలు కాగా.. అప్పటికే పంటంతా చేజారిపోయింది. వర్షానికి వేల ఎకరాల్లో నష్టం సంభవించగా... మిగిలిన పత్తిని కొంటారో లేదోనన్న అనుమానంతో వ్యాపారులకు తక్కువ ధరకే అమ్ముకున్నారు. కొంతమంది రైతులకు చేజిక్కింది 20 శాతమే అయినా... ఆ పత్తిని అమ్ముకుందామంటే ఇలా వరుసగా అడ్డంకులు ఏర్పడుతూనే ఉన్నాయి.

ఇదీ చదవండి: నివర్ పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: నిరంజన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.