నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకీ స్థానిక ఏరియా ఆసుపత్రికి కరోనా అనుమానితులు టెస్టుల కోసం పెద్ద ఎత్తున వస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షల కోసం వచ్చిన వారు ఎండ వేడిమికి తట్టుకోలేక చెట్ల కింద కాసింత నీడ దొరుకుటుందేమోనని వేచివుండే పరిస్థితి నెలకొంది.
ఎండను తట్టుకోవడానికి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని బాధితులు వేడుకుంటున్నారు. ఎండలో మహిళలు, వృద్ధులు, పిల్లలు నిలబడలేక నానా అవస్థలు పడ్డారు. జ్వరం, ఇతర లక్షణాలతో టెస్టుల కోసం వచ్చిన వారు ఎండలో నిలబడలేక చెట్ల కింద కూర్చుంటున్నారు. ఒక్క లైన్ అంటూ లేదని, పర్యవేక్షణ సరిగా లేదని టెస్టుల కోసం ఇచ్చిన వారు వాపోతున్నారు.
రాబోయే రోజుల్లో కరోనా టెస్టులు, టీకాల కోసం పట్టణ వాసులు అధిక సంఖ్యలో ఆసుపత్రికి వచ్చే అవకాశం ఉన్నందున... ఎండ వేడిని తట్టుకునే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలని బాధితులు కోరుతున్నారు. ఇకనైనా ఆస్పత్రి యాజమాన్యం, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవాలని అంటున్నారు.
ఇదీ చూడండి : మరణంలోనూ తోడు.. కరోనా సోకి భార్యాభర్తలు మృతి