నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బీఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఆయుర్వేద కరోనా మందు పంపిణీ కార్యక్రమాన్ని కృష్ణపట్నం ఆనందయ్య ప్రారంభించారు. హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. బత్తుల లక్ష్మారెడ్డి బ్రదర్స్, ఆలయ పూజారులు ఆనందయ్యకు ఘనస్వాగతం పలికారు. పూలమాలలు వేసి శాలువాతో సత్కరించారు. కరోనా మందు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనందుకు ఆనందయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.
నేడు ఆయుర్వేద మందుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా మాత్రమే ప్రారంభిస్తున్నామని బత్తుల లక్ష్మారెడ్డి బ్రదర్స్ చెప్పారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని కరోనా బాధితుల సమాచారం తెలుసుకొని... నేరుగా వాళ్ల ఇంటికే మందులు పంపిస్తామని పేర్కొన్నారు. పూర్వీకుల నుంచి నేర్చుకున్న వంశపారంపర్య వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్నామని ఆనందయ్య తెలిపారు. మందు పంపిణీలో అవాంతరాలు ఎదురైనా... చివరికి ప్రజలకు అందిస్తున్నామన్నారు. మందు వేసుకునేందుకు వచ్చిన వారంతా... మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు.
ఇదీ చదవండి: MMTS: పట్టాలెక్కిన ఎంఎంటీఎస్ రైళ్లు