ETV Bharat / state

ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి: మానిక్కం ఠాగూర్​ - నేతలతో మాణిక్కం ఠాకూర్​ సమావేశం

నాగార్జున సాగర్ ఎన్నికలను ఒక ఉప ఎన్నిక మాదిరి చూడొద్దని... ప్రతి నాయకుడు, కార్యకర్త పూర్తి స్థాయిలో కష్టపడి జానారెడ్డిని గెలిపించుకోవాలని కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్‌ సూచించారు. శక్తివంచన లేకుండా ప్రతి ఒక్కరు కాంగ్రెస్​ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పని చేయాలని కోరారు.

sagar by poll, telangana
takur, congress
author img

By

Published : Apr 5, 2021, 6:38 PM IST

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్​ జూమ్‌లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఎన్నికలకు సమయం తక్కువ ఉన్నందున ప్రతి అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. తెరాస, భాజపా బయట కుస్తీ, లోపల దోస్తీలా వ్యవహరిస్తున్నాయని ఠాగూర్‌ ఆరోపించారు. ఆ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటర్ల మద్దతు కూడగట్టాలన్నారు.

మండల ఇంఛార్జిలతో సమావేశమైన ఠాగూర్ జానారెడ్డిని గెలిపేంచేందుకు అన్ని విధాల కృషి చేయాలని కోరారు. సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సాగర్ కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డి, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: సాగర్​లో కాంగ్రెస్​ నేతల ఇంటింటి ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.