ETV Bharat / state

Janareddy: 'కార్యకర్తలు భారీగా తరలిరండి.. ఆ సభను విజయవంతం చేయండి'

author img

By

Published : May 4, 2023, 3:45 PM IST

Janareddy on Priyanka Gandhi Hyderabad Tour: కాంగ్రెస్‌లో పీసీసీ అధ్యక్షుడి నుంచి కార్యకర్త వరకు అంతా సమానులే అని ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో నిర్వహించిన నిరుద్యోగ నిరసన సభను ఎలా విజయవంతం చేశారో.. అలాగే ఈ నెల 8న హైదరాబాద్​లో జరిగే ప్రియాంక గాంధీ సభను సక్సెస్ చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ నిరుద్యోగుల పక్షాన పోరాడుతుందన్నారు.

Janareddy
Janareddy

Janareddy on Priyanka Gandhi Hyderabad Tour: ఈ నెల 8న హైదరాబాద్‌లో జరిగే నిరుద్యోగ నిరసన సభకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ రానున్నందున పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తుంది. హైదరాబాద్‌ పరిసర జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా యువతను తరలించేందుకు కాంగ్రెస్‌ నేతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో నల్గొండలో పర్యటించిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి.. ఉమ్మడి జిల్లా నుంచి భారీగా కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్‌ పోరాడుతుందన్న జానారెడ్డి.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు.

పీసీసీ అధ్యక్షుడి నుంచి కార్యకర్త వరకు అంతా సమానులే: ఈ సందర్భంగా నల్గొండ జిల్లాలో గత నెల 28న జరిగిన నిరుద్యోగ నిరసన సభను విజయవంతం చేసిన నిరుద్యోగులకు, పార్టీ శ్రేణులందరికీ జానారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడి నుంచి కార్యకర్త వరకు అందరూ సమానులే అన్న ఆయన.. పార్టీ కోసం అందరూ కలిసి పని చేయాలని కోరారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ ఒక్క కాంగ్రెస్ నాయకులను కానీ, కార్యకర్తలను కానీ చిన్నచూపు చూడకూడదని సూచించారు.

ప్రియాంక గాంధీ సభను విజయవంతం చేయండి: నల్గొండ జిల్లాలో నిర్వహించిన నిరుద్యోగ సభను ఏ విధంగా అయితే విజయవంతం చేశారో.. అదేవిధంగా హైదరాబాద్​లో ఈ నెల 8న జరిగే ప్రియాంక గాంధీ సభను కూడా సక్సెస్ చేయాలని జానారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలని ప్రియాంక గాంధీ నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. సమయం లేకపోవడంతో.. ఆరోగ్యం బాగాలేక భట్టి విక్రమార్క పాదయాత్రలో పాల్గొనలేక పోయానని చెప్పారు. నల్గొండ జిల్లాలో 14 లక్షల ఎకరాల్లో సాగుకు నీళ్లు పారుతున్నాయని.. ఇంకా 7 నుంచి 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సి ఉందన్నారు.

'నల్గొండ నిరుద్యోగ నిరసన సభ విజయవంతమైంది. నిరుద్యోగ సభను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు. నల్గొండలో సభపైకి కొందరిని పిలవనందుకు అన్యథా భావించొద్దు. కాంగ్రెస్‌లో పీసీసీ అధ్యక్షుడి నుంచి కార్యకర్త వరకు అంతా సమానులే. ఈ నెల 8న ప్రియాంకగాంధీ సభను విజయవంతం చేయాలి. ఆరోగ్యం బాగాలేక భట్టి పాదయాత్రలో పాల్గొనలేకపోతున్నా. త్వరలో భట్టి విక్రమార్క పాదయాత్రలో పాల్గొంటా.'-జానారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు

ఈనెల 8న ప్రియాంకగాంధీ సభను విజయవంతం చేయాలి: జానారెడ్డి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.