నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో అధికార తెరాస... డబ్బులు పంచి గెలవాలని చూస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆరోపించారు. తెరాస... మద్యం, డబ్బు విచ్చలవిడిగా పంపిణీ చేస్తోందని విమర్శించారు. ఇంత జరుగుతున్నా... ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదని, పోలీసులు కూడా ఏకపక్షంగా అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ధ్వజమెత్తారు.
ప్రజాస్వామ్య యుతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే మాజీ మంత్రి జానారెడ్డి గెలుపు ఖాయమని వీహెచ్ జోస్యం చెప్పారు. ప్రజలు జానారెడ్డి పక్షాన ఉన్నారని.. కానీ గులాబీ పార్టీ డబ్బుతో జనాలను కొనాలని చూస్తోందని ఆరోపించారు. కరోనాతో ప్రజలు భయబ్రాంతులకు గురవతుంటే షర్మిలకు ఎలా అనుమతి ఇచ్చారని డీజీపీ మహేందర్ రెడ్డిని ప్రశ్నించారు.
వాళ్లకో న్యాయం.. మాకొక న్యాయమా? అని ప్రశ్నించారు. భాజపా, తెరాస.. ఆంధ్ర ఓట్లను కొల్లగొట్టడానికి చేస్తున్న నాటకంగా అభివర్ణించారు.
ఇదీ చదవండి: సంక్షేమ పథకాల్లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్: ఇంద్రకరణ్